త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్

434
Chiranjeevi Trivikram Srinivas
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో ప్రేక్‌షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇక తర్వాతి మూవీ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈసినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటివలే పూర్తయ్యాయి. కాగా నవంబర్ నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

ఇక చిరంజీవి తర్వాతి మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండనుంది. ఇటివలే చిరంజీవికి త్రివిక్రమ్ ఒక లైన్ వినిపించాడట..చిరు ఆ లైన్ నచ్చడంతో పూర్తి కథ రెడీ చేయమని చెప్పారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈమూవీని అల్లు అరవింద్, రామ్ చరణ్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో అల..వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు. ఈమూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

- Advertisement -