- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. రేవంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇక వీరిద్దరి భేటీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి బీఆర్ఎస్ సర్కార్‌లో సినీ ఇండస్ట్రీకి మంచి మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇండస్ట్రీలోని చాలామంది సన్నిహిత సంబంధాలున్నాయి.
త్వరలోనే నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్రాంతి తీసుకుంటున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిరంజీవి 156వ సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు.
Also Read:దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే..?
- Advertisement -