చిరు 152 షూటింగ్ షురూ.. లుక్ అదిరింది..

629
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా `సైరా నరసింహారెడ్డి`. ఈ చిత్రం పాన్ ఇండియా కేటగిరీలో విదుదలైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లతో చిరు క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని ప్రూవైంది. ఇక ఆ తర్వాత కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్న చందంగా ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రారంభోత్సవం గురించి సరైన సమాచారం లేదు.

Chiru152

అయితే తాజాగా చిరు 152వ సినిమా గురించి అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం నుండి కోకాపేట‌లో వేసిన భారీ సెట్‌లో మొదైలంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను నిరంజ‌న్‌రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చిరు ఇప్పటివరకు కనిపించని పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

కాగా ఫిలింనగర్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇందులో చిరు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగిగా కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేసేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంది.

- Advertisement -