అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు

71
chiranjeevi
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి వ్యవహార శైలి చాలా పద్ధతిగా ఉంటుంది. చాలా విషయాల్లో చిరు పెర్ఫెక్ట్ గా ఉంటారు. అది మరోసారి రుజువైంది. చిరంజీవి ఓ సినిమా ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ రెండు సినిమాలను మెగాస్టార్ తో ప్లాన్ చేసింది. ఇక్కడే మిగిలిన హీరోలకు మెగాస్టార్ కు తేడా తెలిసింది. సాధారణంగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలను చేయాల్సి వచ్చినపుడు పెద్దగా కష్టం ఏమీ వుండదు. ఎందుకంటే బడ్జెట్ లు ఉంటాయి. సినిమా టీమ్ కూడా పెర్ఫెక్ట్ గా ఉంటుంది.

కాబట్టి.. సినిమా షూటింగ్ కూడా అరటి పండు వలిచి పెట్టినట్లు ఉంటుంది. హీరోకి చూపించి, ఓకె అన్న తరువాత డైరెక్టర్ పిక్చరైజ్ చేస్తాడు. దీనికి ఏ క్రియేటర్ అయినా సరిపోతాడు. కానీ మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ ఇలా వీళ్లంతా తమకు ఫలానా స్టైల్ కావాలి, ఫలానా కొరియోగ్రాఫర్ కావాలి, ఇలా మాకు ఫలానా అంటూ చాలా ఉంటాయి. కానీ మెగాస్టార్ లాంటి నటుడికి మాత్రం ఇలాంటి ఫలానా లు ఉండవు. ఆయన నిర్మాత బాగు చూస్తారు. నిర్మాత బాగుండాలని కోరుకుంటారు. అందుకే.. ప్రస్తుతం చేస్తున్న ఓ సినిమా విషయంలో రెమ్యునరేషన్ ఇంకా పెండింగ్ లో ఉన్నా.. సినిమా బాగా రావడం కోసం అదనంగా కష్ట పడుతున్నారు. దటీజ్ మెగాస్టార్.

అసలు ఇలాంటి విషయాల్లో మెగాస్టార్ ను చూస్తే శహభాష్ అనాలనిపిస్తుంది. మరే పెద్ద హీరో అయినా రెమ్యునరేషన్ విషయంలో అసలు మొహమాటం లేదు అంటాడు. కమర్షియల్ గా తనకు ఆ సినిమా ఎంతవరకు ఉపయోగ పడుతుంది అని ఆలోచిస్తాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం.. సినిమా గురించి ఆలోచిస్తారు. అందుకే.. మెగాస్టార్ అయ్యారు.

ఇవి కూడా చదవండి…

పాన్ ఇండియా కాదు..అంతకు మించి

అందం అమ్మాయి ఐతే…. అనసూయ

స్టాప్‌ ను తోసేసిన యాంకర్‌ సుమ…

- Advertisement -