మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి 47 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో భావోద్వేగంతో ట్వీట్ చేశారు మెగాస్టార్. ప్రేక్షకులకు చిరంజీవిగా పరిచయమై నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
తనను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని తెలిపారు చిరంజీవి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే… అందుకు కారణం నిస్వార్ధమైన మీ “ప్రేమ”.ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూన్నానని తెలిపారు చిరు.

Also Read:తిరుమల శ్రీవారికి భారీ విరాళం

