‘అంత‌రిక్షం’ తొలి టికెట్ కొనుగోలు చేసిన రామ్ చర‌ణ్‌..

274
ram charan antariksham
- Advertisement -

మెగా హీరో వ‌రుణ్ తేజ్, యువ ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమా అంత‌రిక్షం. ఈమూవీలో వ‌రుణ్ స‌ర‌స‌న అదితి రావ్ హైద‌రి, లావ‌ణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా న‌టించారు. నిన్న సాయంత్రం హైద‌ర‌బాద్ లో ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈకార్య‌ర్ర‌మానికి ముఖ్య అతిధిగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఈచిత్ర తొలి టికెట్ ను రామ్ చ‌ర‌ణ్ కొనుగోలు చేశారు. వరుణ్ చాలా మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాడని అన్నారు చ‌ర‌ణ్‌.

varun

ఇలాంటి క‌థ‌లు తీయాలంటే చాలా ధైర్యం ఉండాల‌ని..ఇలాంటి సాహం చేసినందుకు నిర్మాతలు క్రిష్, రాజీవ్ రెడ్డిల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. నేను ఈ ఆడియో ఫంక్ష‌న్ కు వ‌రుణ్ మీద ప్రేమ‌తో రాలేద‌ని..ఈమూవీ ట్రైల‌ర్ చూసి ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని చెప్పారు. ద‌ర్శ‌కుడు సంకల్ప్ టాలీవుడ్ లో టాప్ ద‌ర్శకుడు అవుతాడ‌న్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించారు. ఈ నెల 21న ‘అంతరిక్షం’ విడుదల కానుంది.

- Advertisement -