షాకిస్తున్న నిహారిక లుక్

221
Mega-Princess
- Advertisement -

కొణిదెల కుటుంబం నుంచి ఎంతో మంది వార‌సులు వ‌చ్చారు. కానీ ఒకే ఒక్క అమ్మాయి సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యింది. కానీ ఫ‌లితం నిరాశగా మిగిలింది. అయినా వెబ్ సిరీస్‌లు, చిన్న తెర‌లో క‌నిపిస్తూ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక సంద‌డి చేస్తోంది. ఇటీవ‌ల‌నే తండ్రితో క‌లిసి ఓ వెబ్ సిరీస్ ప్రారంభించారు. దాని ప్రొమోకు విశేష స్పంద‌న వ‌స్తోంది. తెలుగులో పెద్ద‌తెర అరంగేట్రం అచ్చి రాలేదు. ఒక మనసు చిత్రం అంద‌రికీ న‌చ్చినా పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో ఆ అమ్మ‌డు త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లింది. స్టార్ హీరో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇప్పటికే చాలా భాగం ఆ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

niharika-vijay-sethupathi

ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై కోలీవుడ్ లో మంచి ఆసక్తి కనపడుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి.. నీహారిక లుక్ బయటకు వచ్చింది. సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్న నీహారిక స్టిల్ ఒక్కసారిగా షాక్ కొట్టించేసింది. ఒంటి నిండా ఆభరణాలు.. ధరించిన దుస్తులు అన్నీ పూర్తి స్థాయి రీగల్ లుక్ లోనే ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ సినిమా కంటెంట్ గురించి లీక్ కాకపోయినా.. నీహారిక లుక్ ను చూస్తే మాత్రం.. ఈ చిత్ర కథపై ఊహాగానాలు మొదలైపోయాయి.

- Advertisement -