బిగ్ బాస్ 5లో రామ్ చరణ్ సందడి.. ప్రోమో రిలీజ్..

155
ramcharan
- Advertisement -

బిగ్ బాస్ ఆట తొలివారం నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. కాగా టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ బిగ్ బాస్-5 తాజా ఎపిసోడ్‌లో సందడి చేశారు. హోస్ట్ నాగార్జున విచ్చేసిన ఈ ఎపిసోడ్ కు రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మేరకు స్టార్ మా చానల్ ప్రోమో రిలీజ్ చేసింది. తాను ఇవాళ లోబో తరహాలో డ్రెస్ చేసుకుని వచ్చానని రామ్ చరణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నాగ్… ఒక్కొక్క కంటెస్టెంట్‌ను చెర్రీకి పరిచయం చేశారు. ఇంటి సభ్యులతో వినోదం పంచుతూనే, మరోవైపు వారికి చురకలు అంటిస్తూ నాగ్ తాజా ఎపిసోడ్ ను రక్తికట్టించినట్టు ప్రోమో చెబుతోంది.

- Advertisement -