జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక లో అయన తండ్రి టి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొదురుపాక హై లెవల్ వంతెన పై దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు ప్రయాణికులకు ఆహ్లాదకరంగా ఉండే అయిదు వందల పూల మొక్కలను రవీందర్ రావు తెప్పించారు. ఈ కార్యక్రమానికి ముక్య అతిధులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి చైర్ పర్శన్ న్యాల కొండ అరుణ,చొప్పదండి ఏం ఎల్ ఏ సుంకే రవిశంకర్ హాజరై మొక్కలు నాటారు.
మెగా ప్లాంటేషన్ లో మండల లోని జెడ్పి టి సి ,ఎంపిపి , సర్పంచ్ లు,ఎంపిటి సి లు ,మార్కెట్ కమిటి చైర్మన్,మార్కెట్ కమిటి డైరెక్టర్లు, ఎస్ ఐ శ్రీనివాస్ ,పోలిస్ సిబ్బంది తో పాటు ,బారి సంక్యలో టి ఆర్ ఎస్ నాయకులూ హాజరై మొక్కలను నాటారు.అనంతరం టిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు తో కలిసి ఏం ఎల్ ఏ సుంకే రవి శంకర్ ,జెడ్పి చైర్ పర్సన్ న్యాల కొండ అరుణ లు కేక్ కట్ చేసారు.ఏం ఎల్ ఏ ,జోగినపల్లి రవీందర్ రావు లు మొక్కలు నాటుతూ తన మొబైల్ లో సేల్ఫీ లు తీసుకున్నారు .
అనంతరం ఏం ఎల్ ఏ ,జెడ్పి చైర్ పర్శన్ లు మాట్లాడుతూ రాజ్య సబ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న గ్రీన్ చాలెంజ్ దేశానికే ఆదర్శమని కొనియాడారు.తనను ఆదర్శంగా తీసుకొని సినిమా యాక్టర్లు,క్రీడా కారులు ,కేంద్ర మంత్రులతో పాటు అనేక అమంది గ్రీన్ చాలెంజ్ లో బాగంగ మొక్కలు నాతుతున్నారని అన్నారు.తెలంగాణ లో అటవీ సంపద లేక ఎంతో నష్ట పోయామని అన్నారు .ముఖ్యమంత్రి కెసిఆర్ హరిత హారం చేపట్టిన నుండి వేల కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నామని అన్నారు.సంతోష్ కుమార్ నిండు నూరేళ్ళు సుక సంతోషాలతో ఉంటు ప్రజలకు మరింత సేవ చేయలని ఆకాంక్షించారు.ఈ కార్య క్రమం లో టిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులూ జోగినపల్లి ప్రేమ సాగర్ రావు,ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్,జెడ్పి అతి సి కత్తెర పాక ఉమా కొండయ్య,నాయకులూ కత్తెర పాక కొండయ్య ,అనుముల బాస్కర్,తదితరులు పాల్గొన్నారు.