చిరు ‘భోళా శంకర్’ షూటింగ్ షురూ..

157
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఘనంగా నిర్వహించారు. సోమవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఏస్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి మీద ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

భోళా శంకర్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. టైటిల్ పోస్టర్, రాఖీ పండుగ నాడు విడుదల చేసిన స్పెషల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవిని మెహర్ రమేష్ విభిన్న గెటప్స్‌లో చూపించబోతోన్నారు. అద్భుతమైన కథకు.. మరింత అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం తోడైంది. చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. కీర్తి సురేష్ ఆయన చెల్లిగా కనిపించనున్నారు. పక్కా కమర్షియల్‌గా ఈ చిత్రం ఉండబోతోంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. భోళా శంకర్ వచ్చే ఏడాది థియేటర్స్ లో విడుదల కానుంది.

నటీనటులు : చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు

సాంకేతిక బృందం
డైరెక్టర్ : మెహర్ రమేష్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికిపాటి
డీఓపీ : డడ్లీ
సంగీతం : మహతి స్వర సాగర్
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
స్క్రిప్ట్ పర్యవేక్షణ : సత్యానంద్
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, దిలీస్ సుబ్బరాయన్, కెచ్చా
కొరియోగ్రఫర్ : శేఖర్ మాస్టర్
లిరిక్స్ : రామ జోగయ్య శాస్త్రి, కాస్లర్ శ్యాం, శ్రీమణి, సిరా శ్రీ
వీఎఫ్ఎక్స్ : యుగంధర్
పబ్లిసిటీ డిజైన్ : అనిల్ భాను
పీఆర్వో : వంశీ శేఖర్
డిజిటల్ మీడియా హెడ్ : విశ్వ సీఎం
లైన్ ప్రొడక్షన్ : మెహర్ క్రియేషన్స్
ప్రొడక్షన్ కంట్రోలర్ : అజయ్ కుమార్ వర్మ
చీఫ్ కో డైరెక్టర్ : లలిత్ ప్రభాకర్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్ : రామకృష్ణ రెడ్డి, రవి దుర్గా ప్రసాద్

- Advertisement -