సాయి పల్లవిని పెళ్లిచేసుకుంటా..రాశి ఖన్నాను..

237
Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్‌ శంకర్ దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా గద్దలకొండ గణేశ్. ఈమూవీ బాక్సాఫిస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబడుతుంది. ఈమూవీలో వరుణ్ తేజ్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. గద్దలకొండ గణేశ్ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈమూవీలో మృణాళిని పూజా హెగ్డె హీరోయిన్లుగా నటించారు. తాజాగా వరుణ్ మంచు లక్ష్మీ ఫీట్ అప్ విత్ స్టార్స్ అనే రియాల్టీ షో లో పాల్గోన్నారు.

varun Tej Manchuu Lakshmi

సందర్భంగా వరుణ్ తేజ్ అభిమానులతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సాయి పల్లవి, రాశి ఖన్నా, పూజా హెగ్డె ఈముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? ఎవరిని చంపుతావ్? ఎవరితో డేటింగ్ కి వెళ్తావు? అని అడగ్గా.. వరుణ్ వెంటనే సమాధానం ఇచ్చాడు. సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత పూజా హెగ్డె తో డేటింగ్ చేస్తాను.. రాశి ఖన్నాను చంపేస్తానని సరదాగా చెప్పారు. ఇక సాయి పల్లవి వరుణ్‌ తేజ్ కలిసి ఫిదా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.