నితిన్ రష్మీక మందన కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భీష్మ. వెంకీ కుడుములు దర్శకత్వం వహించారు. ఈమూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత నితిన్ సక్సెస్ సాధించాడు. రీసెంట్ గా వైజాగ్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్ . ఈకార్యక్రమానికి మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ… భీష్మ సక్సెస్ మీట్ కు గెస్ట్ గా కాకుండా నితిన్ ఫ్రెండాల వచ్చాను. నితిన్ తో నేను ఒకటిన్నర సంవత్సరంగా ట్రావెల్ చేస్తున్నాను. ఈమూవీ స్టోరీ నాకు ముందే తెలుసు. సినిమా హిట్టవ్వా లని కోరుకున్నా. నిజంగా నా సినిమా హిట్టయితే ఎంత హ్యాపీగా ఫీలవుతానో, దానికంటే ఎక్కువగా నితిన్ సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీలయ్యాను. నితిన్ సినిమా అంతా జెన్యూన్‌గా తీసి, ఒక విషయంలో మోసం చేశాడు. భీష్మ.. సింగిల్ ఫరెవర్ అన్నాడు. ఫస్ట్ రీల్ అయ్యేసరికల్లా ఒకమ్మాయిని పడేశాడు. సింగిల్ గా ఉంటానని చెప్పి రిలీజ్‌కి ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మమ్మల్ని మోసం చేశాడు. ఏది ఏమైనా నితిన్ పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా హ్యపిగా ఉందన్నారు.