ఉపాసన, చరణ్ దంపతులు ఉ.1.49 గంటలకు ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగాప్రిన్సెస్ పుట్టిన రోజైన జూన్ 20కు అప్పుడే ఫ్యాన్స్ ఓ సెంటిమెంట్‌ను అల్లేశారు. మెగాస్టార్ చిరూ బర్త్‌డే ఆగస్ట్ 22, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2. ఇక పాప విషయానికి వస్తే.. తన ఇద్దరు తాతల పుట్టిన రోజు లాగే మెగా ప్రిన్సెస్ పుట్టిన రోజు జూన్ 20. అంటే.. పాప బర్త్ డే లో కూడా 2 అనే అంకె ఉంది. కాబట్టి చిరు – పవన్ ల బర్త్ డేస్ లో కూడా 2 ఉందని.. కాబట్టి పాప కూడా తన ఇద్దరి తాతలు లాగే గొప్ప జాతకురాలు కాబోతుందని ఫ్యాన్స్ జోస్యం చెప్తున్నారు.
మరోవైపు సినీ ప్రముఖులకు జాతకాలు చెప్పే వేణు స్వామి కూడా మెగా ప్రిన్సెస్ జాతకం పై క్రేజీ కామెంట్స్ చేశారు. మెగా ప్రిన్సెస్ ది పునర్వసు నక్షత్రము, రెండవపాదము, మిధున రాశిq అట. అంటే.. ఆ పాప జన్మించిన సమయం నిజంగా అధ్భుతంగా ఉందట. జాతకంలో విపరీతమైన రాజయోగం ఉంది. కొణిదెల వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తుంది. తాతను, తండ్రిని మించి గొప్ప స్థాయికి చేరుకుంటుంది” అని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రుల కావడంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి.
Also Read:బెల్లంతో ఉపయోగాలు
దీంతో ఈ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ కూడా వీరికి శుభాకాంక్షలు చెప్పారు. ‘రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన తరుణాన ప్రేమపూర్వక శుభాకాంక్షలు.. శుభాశీస్సులు..’ అంటూ ట్వీట్ చేశారు. మెగా ఫ్యాన్స్ వెల్ కమ్ మెగా ప్రిన్సెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:Harishrao:యోగా జీవనవిధానం కావాలి