మెగా దీపావళి…

258
online news portal
- Advertisement -

సాధారణ నటుడి స్థాయి నుంచి ‘స్వయంకృషి’తో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు చిరంజీవి. అందుకే ఆయన అభిమానులు ఆరాధించే ‘మెగాస్టార్‌’ అయ్యారు. చిరు ప్రోత్సాహంతోనే ఆయన సోదరులు నాగబాబు, పవన్‌కల్యాణ్‌ తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. దాదాపు 8 ఏళ్ల తరువాత మొఖానికి రంగేసుకున్న మెగాస్టార్ చిరంజీవి…ఖైది నెంబర్ 150 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా చిరు 150వ సినిమా వార్తలు టీ-టౌన్‌లో చక్కర్లు కొడుతునే ఉన్నాయి. ఫస్ట్ డే ఆన్ లొకేషన్ ఫోటోల దగ్గరి నుంచి తాజా అప్ డేట్స్ వరకు చిరు కొత్త లుక్స్‌ ప్రేక్షకులను,అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక మెగాస్టార్ 150 మూవీ ఫస్ట్ లుక్ దివాలీ కానుకగా రిలీజ్ అయ్యింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి ఇచ్చిన స్టయిల్ అయితే వావ్ అనిపించింది. గ్యాంగ్ లీడర్ గుర్తుకొచ్చాడు. కళ్లకు గ్రీన్ గ్లాస్ లు, ట్రిమ్ చేసిన గడ్డం.. చిరునవ్వుతో 40 ఏజ్ లో మెగాస్టార్ కనిపించాడు. ఓ చేతికి బ్యాండ్స్ ఉన్నాయి. షోల్డర్స్ పైకి చొక్కాను ఫోల్డ్ చేసుకుంటూ.. సవాల్ చేస్తున్నట్లు ఉన్న చిరంజీవి పోస్టర్ కు అభిమానులు ఫిదా అయ్యారు.

online news portal

దీపావళి సందర్భంగా ‘మెగా’ నటులంతా కలిసి దిగిన ఓ ఫొటోను ‘ఖైదీ నంబర్‌ 150’ ట్విట్టర్‌ ఖాతా ద్వారా రామ్‌చరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150’ దీపావళి ఇలా జరుపుకొన్నారు అంటూ ఫొటోను ట్వీట్‌ చేశారు.ఇక చిరంజీవి స్ఫూర్తితోనే ఆయన కుటుంబం నుంచి వచ్చిన నట వారసులు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, అల్లు శిరీష్‌, వరుణ్‌తేజ్‌, నిహారికలు. ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఎవరి శైలిలో చిత్రాలను చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చిరు ఖైది నెంబర్ 150ని రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -