మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ విడాకుల విషయంలో సోషల్ మీడియాలో జరిగిన చర్చ ఎవరి విషయంలోనూ జరగలేదనే చెప్పుకోవాలి, పెద్దలు కుదిర్చిన వివాహాన్ని కళ్యాణ్ దేవ్ తో అంగరంగ వైభవంగా చేసుకున్న శ్రీజ ఓ పాపకి జన్మనిచ్చిన తర్వాత భర్త కళ్యాణ్ దేవ్ తో వచ్చిన విభేదాలతో శ్రీజ విడాకులు తీసుకుంది. శ్రీజ రెండో భర్తకి కూడా విడాకులు ఇవ్వడం పెద్ద సెన్సేషన్ అవ్వడం కాదు.. శ్రీజ ని సోషల్ మీడియా వేదికగా చాలామంది ట్రోల్ చేశారు. శ్రీజ – కళ్యాణ్ దేవ్ విడాకుల విషయాన్ని మెగా కుటుంబం కూడా డీల్ చేయలేకపోయింది.
ఐతే, ఆ తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా కనిపించని శ్రీజ, ఇప్పుడు మళ్ళీ నిర్మాతగా యాక్టీవ్ అయ్యింది. అయితే, తాజాగా శ్రీజ తన పెళ్లి, విడాకులపై చేసిన కామెంట్స్ చేసింది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. రెండో పెళ్లి తర్వాత తాను చాలా మారింది అని శ్రీజ చెప్పుకొచ్చింది. శ్రీజ ఇంకా మాట్లాడుతూ.. ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు ఒకరినొకరు తెలుసుకోవాలి, వాళ్ళు మన ఇంట్లో అమ్మా, నాన్నలా ఉండరు కదా.. అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు, మా చిరంజీవిగారికి నేను అంటే ప్రాణం’ అంటూ శ్రీజ చెప్పింది.
శ్రీజ ఇంకా మాట్లాడుతూ.. నేను మెగా ఫ్యామిలీ పుట్టినా.. ప్రస్తుతం ఒంటరిగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం నేర్చుకున్నాను. నిజానికి నా రెండో పెళ్లి పెద్దలు కుదుర్చిన వివాహం, నేను విడాకులు తీసుకున్నప్పుడు చాలామంది చాలా అన్నారు. నన్ను, నా కుటుంబాన్ని బ్లేమ్ చేశారు. అది చూసి ఎంతో ఏడ్చాను, మానసికంగా బాధపడ్డాను’ అని శ్రీజ చెప్పింది. మొత్తానికి శ్రీజ పర్సనల్ లైఫ్ లోని సమస్యల వల్ల ఆమె మనసు చాలా బాధ పడింది అని అర్ధం అవుతుంది. ఐతే, శ్రీజ మూడో పెళ్లి పై చాలా రూమర్లు వినిపించాయి. ఎవరైనా మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను’ అంటూ ఆ మధ్య శ్రీజ కామెంట్స్ చేసినట్టు కూడా టాక్ నడిచింది. మరి శ్రీజ మూడో పెళ్లి ఎప్పుడు అనేది కాలమే నిర్ణయించాలి.
Also Read:Revanth:ఆరోగ్య శ్రీ బిల్లులను రిలీజ్ చేయండి