ఒక మనసు సినిమాతో హిరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. ఈమె ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్ లు వెబ్ సిరిస్ లతో బిజిగా గడుపుతుంది. కొంత కాలం టీవి షోల్లో యంకర్ గా కూడా పనిచేసింది. ఇక మరోసినిమా కు హీరోయిన్ గా చేసేందుకు కూడా ప్రయత్నాలు జరగుతున్నాయి. వెబ్ సిరిస్ లతో బిజిగా ఉంటూనే..తెలుగు, తమిళ సినిమాలపై దృష్టి పెడుతుంది మెగా డాటర్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజివి నటిస్తున్న సైరా సినిమాలో కూడా నివారిక నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజా ఈ అమ్మడు ఇచ్చిన ఓ ఇంటర్యూలో మెగా ఫ్యామిలిలోని హీరోల వ్వక్తిత్వం గురించి చెప్పింది.
చిరంజివి నుంచి మీరు నేర్చుకుంది ఎంటి అని అడగగా..మంచి రిజల్ట్ రావాలంటే హార్డ్ వర్క్ చేయవలసిన విషయం పెద్దనాన్న చిరంజివి దగ్గర నేర్చుకున్నట్లు తెలిపింది. ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కోవడం తన నాన్న నాగబాబు నుంచి నేర్చుకున్నినని… సమాజంలో యాక్టివ్ గా తెలివిగా ఉండటం..ఇతరులకు గౌరవం ఇవ్వడం బాబాయ్ పవన్ కళ్యాణ్ నుంచి నేర్చుకున్నానని.. మనం ఎంత బిజిగా ఉన్నా ఫ్యామిలికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది అన్నయ్య చరణ్ దగ్గరి నుంచి నేర్చుకున్నానని తెలిపింది. ఎవరిపై ఎక్కడ కోపం చూపించాలి ఎక్కడ కూల్ గా ఉండాలనే విషయం మా అన్నయ్య వరుణ్ తేజ్ నుంచి నేర్చుకున్నానని..మనకంటే చిన్న వాళ్లను ఎలా చూసుకొవాలి, వాళ్లను గౌరవం ఇచ్చేవిధానం సాయి థరమ్ తేజ్ నుంచి నేర్చుకున్నానని తెలిపగా..అల్లు అర్జున్ నుంచి అకింత భావం అనే విషయాన్ని నేర్చుకున్నానని ఓ ఇంటర్యూలి తెలిపింది.