అల్లు అరవింద్ దావుద్ ఇబ్రహీం: నాగబాబు

228
nagababu
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు గత కొద్ది రోజులుగా పలువురిపై కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన అన్న చిరంజీవి, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నో విషయాలపై స్పందిస్తున్నారని…. కానీ సినీ రంగం నలుగురు పెద్దల చేతిలో ఉందనే వార్తలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సురేష్ బాబు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఈ నలుగురు… మరోవైపు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, అల్లు అరవింద్… ఇంతకు మించిన పెద్ద మాఫియా ఎవరుంటారని చెప్పారు.

allu-aravind

తామే పెద్ద మాఫియా అని… తన అన్నయ్య చిరంజీవి ఓ చోటా రాజన్ అని, అల్లు అరవింద్ ఓ దావూద్ ఇబ్రహీం అంటూ చమత్కరించారు. చిన్న సినిమాలు రిలీజ్ కాకపోవడమనేది డిస్ట్రిబ్యూటర్ లకు సంబంధించిన విషయమని అన్నారు. ఈనలుగురు నిర్మాతల చేతుల్లోనే ధియేటర్లు ఉంటే మాకు ఫ్లాప్ లు ఎందుకొస్తాయని అన్నారు. కష్టపడ్డ వాళ్లే ఇండస్ట్రీలో పైకి వస్తారని చెప్పారు. కథలో దమ్ముంటేనే సినిమాలు ఆడతాయని అన్నారు. ప్రస్తుత కాలంలో 3 నుంచి 4 వారాలకు మించి ఆడే దమ్ము పెద్ద సినిమాలకు కూడా లేదని చెప్పారు.

- Advertisement -