మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాల సినిమా సేవలను కొనియాడుతూ చిరంజీవి రక్తదాన సేవలకు సంఘీభావాన్ని తెలుపుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రానున్న 40 రోజుల్లో 40 రక్తదాన శిబిరాలను నిర్వహించాలని విజయ్ రేపల్లె పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వర్జీనియా రాష్ట్రంలోని స్టెర్లింగ్ నగరం ఇనోవా హాస్పిటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది దాతలు రక్తదానం చేశారు.
అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇనోవా బ్లడ్ డొనేషన్స్ స్టెర్లింగ్ హాస్పిటల్స్ మేనేజర్ ఏజే. చిరంజీవి బ్లడ్ బ్యాంకు గురించి ప్రస్తావించి, బ్లడ్ బ్యాంక్ సేవలను కొనియాడారు. ఈ సమయంలో చిరంజీవి అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం మరింత రెట్టింపయ్యిందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయ్ రేపల్లె అమెరికాలోని ఆప్త సంస్థ ఆధ్వర్యంలో అక్కడున్న చిరంజీవి అభిమానుల సహాయంతో కుటుంబ కార్యక్రమంగా నిర్వహించడంతో అధిక శాతం మహిళలు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే వేదికపై అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.