Mega 157:చిరు-అనిల్..కేరళలో!

8
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిరు సరసన నయన్ హీరోయిన్గా నటిస్తుండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది.

కేరళలోని అలప్పుళకి చేరుకుంది. ఈ కొత్త షెడ్యూల్‌లో చిరంజీవి – నయనతారలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. కేరళ అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. కొరియోగ్రఫీ బాధ్యతలు ప్రముఖ నృత్య దర్శకుడు భాను చేపట్టారు. ఈ షెడ్యూల్ జూలై 23, 2025 వరకూ కొనసాగనుంది. మేకర్స్ త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తుండగా, సుస్మిత కొణిదెల యొక్క గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహనిర్మాతగా పని చేస్తోంది. సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో, ఈ మాస్ ఎంటర్టైనర్‌కి ఎనర్జిటిక్ సౌండ్‌ట్రాక్ అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Also Read:TBGKS ఇంఛార్జిగా కొప్పుల ఈశ్వర్

- Advertisement -