సుభాష్ రెడ్డికి అమెరికాలో అపూర్వ స్వాగతం..

261
- Advertisement -

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని టీఎస్‌ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి అన్నారు.అమెరికాలోని కొలంబస్ నగరంలో TRS – USA ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో టీఎస్‌ఎండీసీ ఛైర్మెన్ సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం సాగు త్రాగు నీరు రంగానికి పెద్ద పీట వేసిందని అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్, విత్తనాలు అందిస్తూ వ్యవసాయానికి నీరు అందించేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని దీని ద్వార తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. మహారాష్ట్ర నుంచి గోదావరి జలాలపై ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందం జరిగిందని వివరించారు. టీఎస్‌ఎండీసీ ఇసుకను ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేందుకు స్యాండ్‌ సేల్స్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం అనే వెబ్ పోర్టల్‌ను రూపొందించిందని తెలిపారు.

america subash reddy

వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, చేనేత, గీత కార్మికులకు పెన్షన్ అందిస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పతకాలతో ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్‌ ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఎన్నారైలు భాగస్వాములు కావాలని, పెట్టుబడులను పెట్టాలని కోరారు.ఈ సందర్భంగా TRS – USA అధ్యక్షులు మహేష్ తన్నీరు మరియు పలువురు ఎన్నారైలు సుభాష్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. టీఎస్‌ఎండీసీ ఛైర్మెన్ గా నియమింపబడ్డ సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేశారు.

TSMDC Subash reddy

మహేష్ తన్నీరు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందని టీఆర్ఎస్ యుఎస్‌ఏ అధ్యక్షులు మహేష్ తన్నీరు తెలిపారు. నవీన్ కానుగంటి మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో యావత్ ప్రపంచం భారత దేశం వైపు చూస్తోందని….కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో పరుగులిడుతున్న మన తెలంగాణ వైపు దేశం చూస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ కానుగంటి, నరసింహ నాగులవంచ పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.

TSMDC

- Advertisement -