చెమటలు పట్టిస్తున్న మీరాజాస్మిన్‌

99
- Advertisement -

మీరా జాస్మిన్‌…. ఒకప్పుడు వరుస సినిమాలతో తమిళ, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ. మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గోరింటాకు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్టార్‌ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైందనే చెప్పాలి. అయితే ఇటీవల మీరా జాస్మిన్‌ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియా లో హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ… తనలో ఇంకా ఏమాత్రం గ్లామర్‌ తగ్గలేదు అనే సంకేతాలు ఇస్తోందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే నాలుగు పదుల వయసులోనూ.. మీరా జాస్మిన్‌ అందం ఏమాత్రం వన్నెతగ్గలేదనే చెప్పాలి. రోజు రోజుకు మీరా జాస్మిన్‌ అందం పెరుగుతోందో అన్న చందంగా కుర్ర హీరోయిన్లకు ఫోటీనిస్తూ.. మీరా జాస్మిన్‌ చేస్తున్న అందాల ఆరబోత కుర్రకారుకు పిచ్చెక్కిస్తుందనే చెప్పాలి. తాజాగా మీరా జాస్మిన్ షేర్ చేసిన ఫొటోస్ ఫాన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. చీరకట్టులో చందమామకే చెమటలు పట్టించే అందాల మెరుపుతో వెలిగిపోతోంది. ఈ చీరకట్టులో మీరా జాస్మిన్ అందాల దేవతలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరా జాస్మిన్‌ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తోందన్న వార్తల నేపథ్యంలో ఎటువంటి పాత్రలు ఎంచుకుంటుందో అన్న చర్చ కూడా సాగుతోంది. అందాలు ఆరబోస్తూ.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న మీరా జాస్మిన్‌ మరిన్ని సినిమాల్లో నటించాలని మనమూ కోరుకుందాం.

ఇవి కూడా చదవండి 

మత్తెక్కిస్తున్న శ్రద్దాదాస్‌..

బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం

హీరోయిన్ కోసం గొడవపడ్డ ప్రభాస్‌, గోపిచంద్

- Advertisement -