ఆ హీరోయిన్ గొంతెమ్మ కోరికలు!

28
- Advertisement -

మీనాక్షి చౌదరికి మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చాడు. ఫలితంగా త్రివిక్రమ్ కి ఇష్టం లేకపోయినా ఆమె ‘గుంటూరు కారం’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఖరారు అయింది. ఒక హీరోయిన్ కి ఓ టాప్ స్టార్ హీరో సినిమా పడితే చాలు, వెంటనే నాలుగైదు సినిమా ఆఫర్లు ఆ హీరోయిన్ని వెతుక్కుంటూ వెళ్తాయి. ప్రస్తుతం మీనాక్షి చౌదరి వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దర్శకనిర్మాతలతో పాటు కొందరు మిడ్ రేంజ్ హీరోలు సైతం ఆమెకు అడ్వాన్స్ లు ఇవ్వడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మీనాక్షి చౌదరిలో నటితో పాటు మంచి కమర్షియల్ పిల్ల కూడా ఉంది. తనకు వచ్చిన డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి అమ్మడు తెగ ప్రయత్నాలు చేస్తోంది.

నిజానికి హిట్ 2 సినిమా సమయంలో మీనాక్షి చౌదరి నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకునేది. కానీ, మహేష్ సరసన మెరిసే అవకాశం రావడంతో.. ఒక్కసారిగా తన రేటును అమాంతం పెంచేసింది. పైగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ ల కోసం సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందుకే, చిన్నాచితకా హీరోలకు మీనాక్షి చౌదరి తన రెమ్యునరేషన్ ను రెండింతలు చేసి చెబుతుంది. మీనాక్షి చౌదరి ఒక్కో సినిమాకి ఇప్పుడు సుమారు రెండు కోట్లు అడుగుతుందని టాక్. పైగా హీరో రేంజ్ ను బట్టి డబ్బులు డిమాండ్ చేస్తోందట. మొత్తానికి మీనాక్షి చౌదరి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో బాగా తెలివిమీరి పోయింది.

Also Read:త్వరలో కామన్ మొబిలిటీ కార్డులు..

మహేష్ బాబు ఛాన్స్ ఇవ్వడమే మీనాక్షి చౌదరికి ఇప్పుడు బాగా కలిసి వచ్చింది. పైగా స్టార్ హీరోయిన్స్ కే సాధ్యం కానీ, కొన్ని మేనేజ్ మెంట్లను మీనాక్షి చౌదరి చాలా సింపుల్ గా మ్యానేజ్ చేసుకుంటూ పోతుందట. ఏది ఏమైనా ప్రస్తుతం మీనాక్షి చౌదరికు తిరుగులేదు. ఆమెకు బాగా డిమాండ్ ఉంది. అందుకే, మీనాక్షి చౌదరి ప్రస్తుతానికి గొంతెమ్మ కోరికలు కోరుతుంది. ఆ కోరికలు తీర్చడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు.

- Advertisement -