‘బెంగాల్‌టైగర్’వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ క.కె. రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఒక్క ఐడియా కోటి రూపాయలు అన్నది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ దగ్గర్నుండి ట్రైలర్ రిలీజ్ వరకు అందర్నీ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ టైటిల్‌తో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నవీన్‌చంద్ర, శృతిసోది, పృధ్వీ, సలోని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. డిజె వసంత్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 19న హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ ధియేటర్‌లో చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లరి నరేష్, లవ్‌లీ రాక్‌స్టార్ ఆది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ధియేట్రికల్ ట్రైలర్, బిగ్ సీడీని అల్లరి నరేష్ ఆవిష్కరించగా, ఆడియో సీడీలను లవ్‌లీ రాక్‌స్టార్ ఆది రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
అల్లరి నరేష్ మాట్లాడుతూ – ”ఈ ఫంక్షన్‌కి రావడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి ఆల్‌మోస్ట్ నా టీమ్ అంతా వర్క్‌చేశారు. ఇండస్ట్రీకి మరో పృధ్వీ బాబు రాబోతున్నాడు. సాంగ్స్‌లో డాన్స్ ఇరగదీశాడు పృధ్వీ. మా జనరేషన్‌కి కాంపిటీషన్ కాబోతున్నాడు. అంత బాగా డాన్స్ చేశాడు. ట్రైలర్ ఫెంటాస్టిక్‌గా ఉంది. ఫుల్ మీల్స్‌లా ఉంది. నవీన్‌చంద్ర క్లోజ్ ఫ్రెండ్. మంచి హార్డ్‌వర్క్ యాక్టర్. ఈ సినిమాతో అతనికి మంచి హిట్ వస్తుంది. వసంత్ నా రెండు సినిమాలకి మంచి మ్యూజిక్ అందించాడు. సత్తిబాబుకి కామెడీ మీద మంచి పట్టు ఉంది. ఈ కథ నాకు తెలుసు. హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రం బిగ్ హిట్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
లవ్‌లీ రాక్‌స్టార్ ఆది మాట్లాడుతూ – ”టైటిల్ చాలా క్యూరియాసిటీగా చాలా బాగుంది. ట్రైలర్ ఎక్స్‌లెంట్‌గా ఉంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న చిత్రమిది. విజయ యాత్రలకి ధియేటర్స్‌కి వెళ్లినపుడు హీరోకి ఎంత అప్లాజ్ వస్తుందో పృధ్వీకి కూడా అంత అప్లాజ్ ఉంటుంది. రాధామోహన్ గారు మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత. చాలా గట్స్ ఉన్న నిర్మాత. సినిమాని అనుకున్న టైంలో తీసి రిలీజ్ చేయగల కెపాసిటీ ఉన్న నిర్మాత. డెఫినెట్‌గా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.
సంగీత దర్శకుడు డి.జె. వసంత్ మాట్లాడుతూ – ”ఈ సినిమాలో రెండు పాటలున్నాయి. ఆ రెండు చాలా బాగా చేయించుకున్నారు సత్తిబాబుగారు. రీ రికార్డింగ్ జరుగుతోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయి మా అందరికీ మంచి బ్రేక్ అవుతుంది” అన్నారు.
దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ – ”మా నరేష్‌తో 4 సినిమాలు చేశాను. నెక్ట్స్ ఇంకో సినిమా చేయబోతున్నాను. నవీన్‌చంద్రతో ఈ సినిమా చేయడం వెరీ హ్యాపీ. పృధ్వీ హీరోకి ఈక్వల్‌గా వుండే క్యారెక్టర్‌లో నటించారు. ట్రైలర్‌లో చేసింది గోరంత అయితే సినిమాలో కొండంత వుంటుంది. ఇట్స్ ఎ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. ఈ సినిమా రీ రికార్డింగ్ స్టేజ్‌లో ఉంది. ఫస్టాఫ్ ఫినిష్ అయింది. ‘నేను’ సినిమాకి విద్యాసాగర్ రీ రికార్డింగ్ అల్టిమేట్‌గా చేశారు. మళ్లీ నా సినిమాకి వసంత్ సూపర్బ్‌గా చేశారు. సినిమా అంతా కంప్లీట్ చేసి త్వరలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
నటుడు కృష్ణుడు మాట్లాడుతూ – ”పృధ్వీగారు మంచి స్వింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. నవీన్‌చంద్ర ఎప్పటి నుంచో పరిచయం. మంచి హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్‌హిట్ సాధిస్తాడు” అన్నారు.
నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ – ”ఈ సినిమా అంతా ఒక ట్రావెల్‌లా జరిగింది. నాగేంద్రకుమార్ చెప్పిన లైన్ బాగా నచ్చింది. ఈ సినిమాకి సత్తిబాబుగారు అయితే కరెక్ట్‌గా న్యాయం చేస్తాడు అనిపించింది. లైన్ నచ్చి, స్టోరీ డెవలప్ చేశారు. విక్రంరాజు, క్రాంతి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి స్టోరీని డెవలప్ చేశారు. దుబాయ్‌లో ఉన్న నా ఫ్రెండ్ ఈ టైటిల్ సజెస్ట్ చేశాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అన్నది గేమ్ షో కాదు. మా సబ్జెక్ట్‌కి పర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. నాకు సహకరించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో కరెక్ట్ టైమ్‌లో సినిమాని కంప్లీట్ చేశాం. సుచిత్ర, గణేష్ మాస్టర్లు మంచి కొరియోగ్రఫి అందించారు. రెండు సాంగ్స్ విజువల్‌గా కనులవిందుగా ఉంటాయి. యాక్టింగ్, డాన్స్ సింగిల్ టేక్‌లో చేశారు పృధ్వీ. ఆడియన్స్‌కి 2 గంటలపాటు ఆనందాన్ని కలిగించే ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్. వసంత్ రెండు పాటల్ని అద్భుతంగా ఇచ్చారు. అలాగే రీ రికార్డింగ్ వండర్‌ఫుల్‌గా చేస్తున్నారు. సెట్‌లో నేను లేకపోయినా మా ఎం.ఎస్. కుమార్, ఇద్దరు శంకర్‌లు దగ్గరుండి సినిమాకి వర్క్‌చేశారు. వారికి నా ధన్యవాదాలు. అతి త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం” అన్నారు.
హీరోయిన్ శృతిసోది మాట్లాడుతూ – ”స్క్రిప్ట్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ప్రియ క్యారెక్టర్ చేశాను. నాకు ఎంతో ఇష్టమైన పాత్ర చేశాను. నవీన్‌చంద్ర ఫాబ్యులస్ కోస్టార్. బాగా సపోర్ట్ చేశారు. సత్తిబాబుగారు పక్కా క్లారిటీతో మంచి పర్ఫామెన్స్‌ని రాబట్టుకున్నారు” అన్నారు.
హీరోయిన్ సలోని మాట్లాడుతూ – ”పృధ్వీకి జోడీగా నటించాను. అతనితో డాన్స్‌లు చేయడం చాలా ఫన్నీగా అనిపించింది. పృధ్వీ ఎక్స్‌లెంట్‌గా డాన్స్ చేశారు. ముఖ్యంగా ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా పలికించారు. ట్రైలర్ అమేజింగ్‌గా ఉంది. పక్కా పైసా వసూల్ ఫిల్మ్ ఇది. రాధామోహన్‌గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. డెఫినెట్‌గా సినిమా సూపర్‌హిట్ అవుతుంది” అన్నారు.
కమెడియన్ ఫృధ్వీ మాట్లాడుతూ – ”నరేష్‌తో కలిసి సక్సెస్ టూర్‌లకి వెళ్లినపుడు ఆడియన్స్ క్లాప్స్, విజిల్స్ వేసేవారు. నాకు ఇలాంటి రెస్పాన్స్ ఎప్పుడు వస్తుందా అనుకున్నాను. ఈ సినిమాలో డాన్స్‌లు చేశాక దూల తీరిపోయింది. గణేష్ మాస్టర్ అద్భుతంగా నాతో డాన్స్ చేయించాడు. మా సత్తిబాబు గురువు ఇ.వి.వి. గారు. ఆయన లేని లోటుని సత్తిబాబుగారు తీరుస్తున్నారు. ఈ సినిమాని సత్తిబాబు అద్భుతంగా డీల్‌చేశాడు. ఆర్టిస్టులు అందరి నుండి తనకి కావల్సిన విధంగా పర్ఫామెన్స్‌ని రాబట్టుకున్నారు. ట్రైలర్‌లో చేసింది గోరంత సినిమాలో చూడాల్సింది కొండంత వుంది. వేరియేషన్స్ వీరబాబు క్యారెక్టర్ చేశాను. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. కామెడీ అలాగే వుంది. క్రాంతి డైలాగ్స్ ఈ సినిమాకి పెద్ద ఎసెట్. టు అవర్స్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన సత్తిబాబు, రాధామోహన్ గారికి నా థాంక్స్” అన్నారు.
హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ – ”ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నరేష్ బాగా సపోర్ట్‌చేసి ఎంకరేజ్ చేశాడు. రాధామోహన్‌గారు మంచి టీమ్‌ని ఫామ్‌చేసి అద్భుతమైన సినిమా తీశారు. ట్రైలర్ అందరికీ నచ్చింది. రెండు పాటలు విజువల్‌గా అందంగా ఉంటాయి. పృధ్వీ, సలోని మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. మంచి లాఫ్టర్ ఎంటర్‌టైనర్. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరో నవీన్‌చంద్ర, పృధ్వీ, హీరోయిన్స్ శృతిసోది, సలోని, సంగీత దర్శకుడు డి.జె. వసంత్, ఎడిటర్ గౌతంరాజు, డిఓపి బాల్‌రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఎం. కిరణ్‌కుమార్, స్టోరీ డైలాగ్ నాగేంద్రకుమార్ వేపూరి, స్టోరీ డెవలప్‌మెంట్ విక్రమ్‌రాజు, డైలాగ్ రైటర్ క్రాంతిరెడ్డి, నృత్య దర్శకురాలు సుచిత్ర, కో డైరెక్టర్ కేశవప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. కుమార్, చిత్ర సమర్పకురాలు లక్ష్మీ రాధామోహన్, జబర్దస్త్ అప్పారావు తదితరులు వేదికపై పాల్గొనగా నిర్మాత కె.కె. రాధామోహన్ ఫ్లవర్ బొకేలతో స్వాగతం పలికారు.