విజయ్ దేవరకొండ మూవీ కోసం మహేశ్ బాబు

332
Mahesh babu Meeku matrame Chepta
- Advertisement -

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ మీకు మాత్రమే చెప్తా అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. షమీర్ అనే నూతన దర్శకుడు ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈసినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అవంతికా మిశ్రా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈమూవీ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 6.20గంటలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

- Advertisement -