తెలంగాణ అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఆయన విజన్ తనకెంతో ప్రేరణ ఇచ్చిందని ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో రూ.3500కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ ఉత్పత్తి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
మార్చి2వ తేదీన ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లీయూ సీఎం కేసీఆర్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ఛైర్మన్ యాంగ్ లియూ లేఖ రాశారు. తన బర్త్‌డే సందర్భంగా కేసీఆర్ విషెస్ తెలిపారని అలాగే తనకు పర్సనల్‌గా గ్రీటింగ్ కార్డు ఇవ్వడం పట్ల లియూ థ్యాంక్స్ తెలిపారు.తెలంగాణ అభివృద్ధి పట్ల మీకు ఉన్న విజన్ నన్ను ఎంతో ప్రేరణకు గురిచేసిందని లియూ అన్నారు. ఇండియాలో తనకు ఓ కొత్త ఫ్రెండ్ దొరికనట్టు లియూ తన లేఖలో పేర్కొన్నారు.
భవిష్యత్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహాంగా ఉన్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా కొంగరకలాన్‌లో తమ కంపెనీ కార్యకలపాలను ప్రారంభిస్తామని అన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌ను తైవాన్‌కు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. తైపిలో ఆతిథ్య సత్కారాలను అందుకోవాలని తన లేఖలో సీఎం కేసీఆర్‌ను కోరారు.
ఇవి కూడా చదవండి…