రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అగ్రసంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ నుండి చేస్తుండగా తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్‌ట్రానిక్స్ సుమారు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈమేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో మెడ్‌ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.
Also Read:‘పదహస్తసనం’తో ఆ సమస్యలు దూరం!
మెడ్‌ట్రానిక్స్ నిర్ణయంపట్ల మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలతో పెట్టుబడులు తరలివస్తున్నాయనడానికి ఇంతకుమించిన నిదర్శనం మరొకటి లేదని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Also Read:కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ