మేడిగడ్డ @ 4.8 టీఎంసీ

1440
Medigadda-Barrage
- Advertisement -

వరదనీటి ప్రవాహంతో కాళేశ్వరం జలకళ సంతరించుకుంది. ప్రాణహితనుంచి వస్తున్న వరదనీటిని సాగునీటిశాఖ ఇంజినీర్లు మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లలో నిల్వచేస్తున్నారు. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని కన్నెపల్లిలో ప్రస్తుతం 3 పంపులు రన్ అవుతున్నాయి. మేడిగడ్డలో గేట్లన్ని మూసివేయడంతో ప్రస్తుతం నీటి నిల్వ 4.8 టీఎంసీకి చేరుకుంది.

అన్నారం బ్యారేజి లో 2.50 టీఎంసీలకుకు పైగా నీరు చేరుకుంది. రేపటి వరకు ఈ నీరు అన్నారం పంపు హౌజ్ ల వరకు వచ్చే అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు.

అన్నారం బరాజ్ నిండుతుండటంతో మానేరులోనూ 3.8 కిలోమీటర్ల వరకు బ్యాక్‌వాటర్ వచ్చింది. మొత్తంగా మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ల బ్యాక్‌వాటర్‌తో దాదాపు 42 కిలోమీటర్ల పొడవున గోదావరి నిండుకుండను తలపిస్తున్నది.

- Advertisement -