డ్రగ్స్‌ కేసులో మీడియా కూడా ఉంది

189
Media too, in drugs racket
Media too, in drugs racket
- Advertisement -

డ్రగ్స్ దందాలో ఓ పత్రికాధిపతి పాత్ర కూడా ఉన్నట్టు శ్యాం కే నాయుడు సిట్‌కు వెల్లడించినట్టు వార్తలు సమాచారం.. ఇదే విషయాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా సిట్‌ వద్ద ప్రస్తావించాడని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో అందుకు తగ్గా సాక్ష్యాలను సంపాదించే పనిలో సిట్ పోలీసులు తలమునకలై ఉన్నారు. నిన్న శ్యాం కే నాయుడిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న వేళ, సదరు పత్రిక యజమాని పేరు బయటకు వచ్చినట్టు సమాచారం. ఆయన పలుమార్లు గోవాకు వెళ్లివచ్చారని, ఆయన్ను ఎందుకు ప్రశ్నించడం లేదని శ్యామ్ సిట్ పోలీసులను ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది.

ఇక కెల్విన్ తో పాటు అరెస్ట్ అయిన మరో డ్రగ్స్ వ్యాపారి పీయుష్ స్మార్ట్ ఫోన్ ను విశ్లేషించగా, వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న విలేకరులు, యాంకర్ల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పీయుష్ కు, వీరికి మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించేందుకు 15 మందికి నోటీసులు పంపేదుకు సిద్దమవుతున్నారు అధికారులు. ప్రాథమిక సాక్ష్యాలను సంపాదించిన తరువాత ఆయనకు నోటీసులు పంపి విచారించే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -