మేడ్చల్ పట్టణంలో ఆకస్మిక తనఖిలు చేశారు జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి. నగరంలో పారిశుధ్యం విషయంలో అధికారులపై మండిపడ్డారు. శ్రీనివాస్ అనే తాత్కాలిక సూపర్వైజర్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేయడంతో పాటు శానిటేషన్ ఏ ఈ రాకేష్ కు మెమో ఇవ్వాలని నగర పంచాయతీ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.వికర్ సెక్షన్ కాలనీ లో రోడ్లు, విద్యుత్ మేడ్చల్ చెక్ పోస్టు ప్రాంతాలలో ఫుట్ పాత్ ల తొలగింపు, పారిశుధ్యం, మరుగుదొడ్లు నిర్మాణం, నగరంలో పందుల సంచారం లేకుండా చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 20 రోజుల్లో పై విషయాలపై చేపట్టిన చర్యలపై నివేధిక ఇవ్వాలని మేడ్చల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం పది రోజుల ప్రణాళిక లో భాగంగా మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖిలు చేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో మున్సిపాలిటీ సంబంధిత అధికారులతో కలిసి పాదయాత్ర చేస్తూ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను కాలనీలో నివాసం ఉంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిజాంపేట్ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి చాలా ఉందని నీటి సమస్య పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని త్వరలోనే నీటి సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.
అలాగే మున్సిపాలిటీ పరిధిలో పిల్లల ఆట స్థలాలు లేకపోవడం ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నారు . మెయిన్ రోడ్ల పై వ్యాపార నిమిత్తం షెడ్లు వేసుకున్న విషయాలను గమనించి అలాంటి చోట్ల అధికారులు అపరిశుభ్ర వాతావరణం నేలకొనకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మున్సిపాలిటీలో శానిటేషన్ పనులను పరిశీలించి అధికారి పనితీరు సక్రమంగా లేకపోవడంతో మున్సిపల్ శానిటేషన్ సూపర్వైజర్ జితేందర్ ను విధినిర్వహణలో నిర్లక్ష్య వైఖరికి బాధ్యుడిని చేస్తూ విధుల నుండి తొలగించడం జరిగింది. నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు.