మేడారం మహాజాతరకు అంకురార్పణ

522
medaram jathara
- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ…తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాభైంది. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఇక మేడారం మహాజాతరకు నేడు అంకురార్పణ జరగనుంది. ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారక్కల పూజారులు బుధవారం గుడిమెలిగె పండుగను నిర్వహించనున్నారు. మేడారంలోని సమ్మక్క దేవత పూజా మందిరంలో, కన్నెపల్లిలోని సారక్క పూజా మందిరాల్లో పూజారుల ఆధ్వర్యంలో పూజలు చేయనున్నారు. వచ్చే బుధవారం మండెమెలిగే పండగను నిర్వహించి అమ్మవార్ల మహాజాతరను ప్రారంభిస్తారు.

ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఫిబ్రవరి 5న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి గోవిందరాజుల రాక..6న చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాక..7న అమ్మవార్లకు మొక్కులు..8న తల్లుల వన ప్రవేశం ఉండనుంది. ఫిబ్రవరి 8న అమ్మవార్ల తిరుగు ప్రయాణంగా వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

- Advertisement -