మేడారం జాతర.. పోటెత్తిన భక్తజనం..

482
- Advertisement -

వరంగల్‌లోని మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు వనదేవతలు దర్శించుకుంటున్నారు. అయితే ఏటా సంక్రాంతి తర్వాత ఇక్కడ జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఈ ఏడాది జాతర జరగనుంది. కానీ అప్పుడే అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులతో మేడారం వీధులు జనజాతరను తలపిస్తున్నాయి.

Medaram-Jatara

ఆదివారం కావడంతో పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, తదితర ప్రాంతాలనుంచి భక్తులు అశేషంగా తరలివస్తున్నారు. ఈ కారణంగా పలు చోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. అయితే జాతర ప్రారంభమయ్యాక భక్తుల రద్దీ ఇంతకంటే ఎక్కువ ఉంటుందని, దానికంటే ఇప్పుడు దర్శించుకోవడమే మంచిదన్న ఉద్దేశంతో చాలామం ది తరలి వస్తుండడం వల్లే ఈ రద్దీ నెలకొందని స్థానికులు చెబుతున్నారు.

ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వారు మేడారం చేరుకున్నారు. పర్యటన సందర్భంగా సీఎస్‌, డీజీపీ మేడారం జాతర ఏర్పాటు, అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అనంతరం పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -