మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. జాతరలో కీలక ఘట్టమైన పగిడిద్దరాజు బయలుదేరే కార్యక్రమం సంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగింది. పెళ్లి కొడుకుగా ముస్తాబైన పగిడిద్దరాజు, మహబూబాబాద్ జిల్లా పొనుగొండ్ల గ్రామం నుంచి అడవి మార్గంలో కాలినడకన మేడారం వైపు ప్రయాణం ప్రారంభించారు. మార్బలంతో కూడిన ఈ యాత్రను భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించారు.
మేడారం సమ్మక్క దేవాలయం నుంచి పట్టువస్త్రాలు తీసుకొచ్చిన పెనక వంశీయులకు మంత్రి సీతక్క వాటిని సమర్పించారు. అనంతరం అచారం ప్రకారం పగిడిద్దరాజు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని మేడారం తరలించారు.
అడవిబాటలో సాగిన ఈ ప్రయాణంలో పగిడిద్దరాజు కార్లపల్లి గుండ్ల వాగు మీదుగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో రాత్రి బస చేశారు. అక్కడ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీపురం నుంచి తెల్లవారుజామున తిరిగి బయలుదేరిన పగిడిద్దరాజు, ఈ నెల 28వ తేదీ రాత్రికి మేడారం గద్దలపై అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా మేడారం పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి.
Also Read:మరోసారి బంగారం భగభగ

