మేడారం హుండీ లెక్కింపు..షురూ

164
medaram
- Advertisement -

నేటి నుండి దక్షిణభారత కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు జరగనుంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణమండపంలో హుండీల లెక్కింపు జరగనుండగా ఇందుకోసం భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

మొత్తం 493 హుండీలను…..300 పైగా సిబ్బంది పలు విభాగాలుగా విడిపోయి ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారు. హుండీలను తెరిచేందుకు ఒక బృందం..వాటిలోని నోట్లు, వెండి, బంగారు వస్తువులను వేరుచేసేందుకు మరో బృందం పనిచేస్తుంది. హుండీ లెక్కింపుకు వచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉండనుంది.

దాదాపు పది రోజుల పాటు జరగనున్న హుండీ లెక్కింపులలో.. ఏ రోజు ఆదాయాన్ని ఆ రోజే బ్యాంకులో జమచేయనున్నారు. సారలమ్మ దేవస్థానం సిబ్బంది, పలువురు స్వచ్చంద సేవకులతో కలిసి ఈ హుండీ లెక్కింపులో పాల్గొననున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది అధిక సంఖ్యలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -