గోదావరి జలాలతో సింగూరు ప్రాజెక్టును నింపీ మెదక్ జిల్లా తాగునీటి గోస తీరుస్తాం అని చెప్పాఉ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ హన్మంతరావులతో కలిసి ప్రారంభించిన హరీష్ సంగారెడ్డిని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు.
రూ.2500 కోట్లతో సంగారెడ్డి నాందేడ్ అకోలా జాతీయ రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. త్వరలో 57 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సున్న వారికి సైతం పింఛను అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
మండల కేంద్రమైన కల్హెర్ లో నూతనంగా ప్రారంభించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆరోగ్య ఉపకరణాల కోసం రూ 50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆరు ఏండ్లలో నారాయణ ఖేడ్ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశామని తెలిపారు హరీష్.