ఆ సినిమాతోనే నటుడిగా గుర్తింపు..

206
Meda Meeda Abbayi Movie Release Press Meet
- Advertisement -

గమ్యం సినిమాతోనే తనకు గుర్తింపు వచ్చిందని  హీరో అల్లరి నరేష్ తెలిపారు.   ఆయన నటించిన లేటెస్ట్   మూవీ మేడ మీద అబ్బాయి రేపు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నరేష్‌తో పాటు అవసరాల  శ్రీనివాస్, శివారెడ్డి, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పాల్గొన్నారు.

ఈ సినిమా తనకు మరో సూపర్‌హిట్‌ సినిమాగా నిలుస్తుందన్నారు నరేష్.  గమ్యం తర్వాత ‘మేడ మీద అబ్బాయి’తో మంచి గుర్తింపువస్తుందన్నారు.  టెక్నాలజీ పెరిగేకొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతూ వస్తోందని, ఇలాంటి అంశాలను సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపారు. సినమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్నారు.

హీరో అవసరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను చేసిన క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుందని,  ప్రతీ పాత్రకూడా అందరినీ ఆలోచింపజేస్తుందన్నారు. హైపర్‌ ఆది మాట్లాడుతూ.. జబర్థస్త్‌ షో ద్వారా ఫేమస్‌ అయిన తనకి అల్లరి నరేష్‌ సినిమాలో అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా అల్లరి నరేష్ కి  మరో హిట్‌ని అందిస్తుందని కొత్త కాన్షెప్ట్‌ తో వస్తున్న ఈ సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు.  శివారెడ్డి మాట్లాడుతూ.. ఎప్పటినుంచో అల్లరి నరేష్ తో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరబోతుందని, అల్లరి నరేష్‌ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

- Advertisement -