మెకానిక్ రాకీ.. అప్‌డేట్

9
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.

సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్‌, ఫస్ట్ సింగల్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్‌కి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా రెండో పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 15న చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇక ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ‘సరిపోదా శనివారం’ మూవీకి జేక్స్ అందించిన మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు ఆయన ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. అక్టోబర్ 31న దీపావళికి విడుదల కానుంది.

Also Read:4 కొత్త విమాన సర్వీసులు:రామ్మోహన్

- Advertisement -