మెకానిక్ రాకీ…కామెడీ యాక్షన్ థ్రిల్లర్

14
- Advertisement -

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’గా ఆలరించబోతున్నారు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ లాంచ్ చేశారు.

విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ట్రయాంగిల్ లవ్ ట్రయాంగిల్‌ను ప్రజెంట్ చేస్తూ.. సినిమాలోని కీలక పాత్రలను రివిల్ చేసేలా ఫస్ట్ గేర్ డిజైన్ చేశారు. ఈ గ్లింప్స్ ఎట్రాక్టివ్ ఎంటర్ టైన్మెంట్, డైనమిక్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది.

మెకానిక్ రాకీ గా విశ్వక్ సేన్ మ్యాసీవ్, ఇంటెన్స్ గా కనిపించారు. విశ్వక్ సేన్ చెప్పిన “ఛోటే చోటే బచ్చో కో పూరోన్ కి మై జవాబ్ దేథూ…”హిందీ డైలాగ్ అదిరిపోయింది, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే “డేంజర్ కే లైసెన్సు వీడు” అనే డైలాగ్ కూడా పవర్ ఫుల్ గా వుంది.

మీనాక్షి చౌదరి ఎత్నిక్ వేర్ లో కూల్ గా కనిపించింది. శ్రద్ధా శ్రీనాథ్ అర్బన్ లేడీ క్యారెక్టర్ లో ఆకట్టుకుంది. L బోర్డ్ సీక్వెన్స్ హిలేరియస్ గా వుంది. సునీల్, నరేష్, రోడీస్ రఘు రామ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించారు.

రవితేజ ముళ్లపూడి అన్ని ఎలిమెంట్స్ తో కూడిన సబ్జెక్ట్‌ని ఎంచుకుని విశ్వక్ సేన్ పాత్రను అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. మనోజ్ కటసాని కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది, జేక్స్ బెజోయ్ ఫంకీ BGM ఎంటర్టైమెంట్ ని ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ఫస్ట్ గేర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. మెకానిక్ రాకీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.

Also Read:రాజా సాబ్..గ్లింప్స్ అప్‌డేట్

- Advertisement -