నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం `ఎంసీఏ`. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటే్శ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 16న వరంగల్‌లో నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా…హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “డబుల్ హ్యాట్రిక్ హీరో నాని ఈ ఏడాది ప్రారంబంలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో `నేను లోకల్` సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది చివరల్లో `ఎంసీఏ` సినిమాతో మరో హిట్‌ను సాధించబోతున్నాడు. ఈ సినిమా సక్సెస్‌తో మా బ్యానర్ ఒకే ఏడాది డబుల్ హ్యాట్రిక్ సాధిస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. రేపు (డిసెంబర్ 12న) ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నామని తెలిపారు.
సినిమా కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపిన దిల్ రాజు… వదిన, మరిదిల మధ్య అనుబంధాన్ని తెలియజేసే చిత్రంగా మా ఎంసీఏ ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 21న విడుదల కానుందని వెల్లడించారు. సినిమా ప్రారంభం నుండి నాని, సాయిపల్లవి జంట ఈ సినిమాలో నటిస్తున్నారనగానే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీరామ్ వేణు సినిమా ను చక్కగా డైరెక్ట్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సాంగ్స్‌ను అందించాడు. ఈ పాటలు అల్రెడి మార్కెట్లోకి విడుదలయ్యయాయి. సాంగ్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే . ఈ డిసెంబర్ 16న వరంగల్‌లో ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నాం అన్నారు.