25న ఎంసిఏ ఆడియో..

320
MCA audio on november 25th
- Advertisement -

సెలక్టెడ్ అండ్ సింపుల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే హీరోల్లో నాని ఒకరు. నిన్నుకోరి తర్వాత  మిడిల్ క్లాస్ అబ్బాయిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న  ఎంసీఏ మూవీ సూపర్ ఫాస్ట్‌గా తెరకెక్కుతోంది.

దీపావళి కానుకగా  ఫస్ట్  లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నాని…టీజర్‌తో సినిమాతో అంచనాలను పెంచేశాడు. గత శుక్రవారం విడుదలైన ఈ టీజర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 24 గంటల్లోనే 30 లక్షల వ్యూస్‌తో టాప్‌ పొజిషన్‌లో నిలిచింది.

షూటింగ్ పూర్తికావొచ్చిన ఈ సినిమా ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ నెల 25వ తేదీన ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి పాటలను విడుదల చేయనున్నట్లు   సమాచారం. డిసెంబర్ 3వ వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ‘ఫిదా’ హిట్ తరువాత సాయి పల్లవి చేస్తోన్న సినిమా ఇదే కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. ఇక నాని వరుస విజయాలు కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.

- Advertisement -