మగవారికి వరం లాంటి ‘మయురాసనం’!

66
- Advertisement -

నేటి రోజుల్లో చాలమంది జీర్ణ సంబంధిత సమస్యలతో భాదపడుతూ ఉంటారు. పని ఒత్తిడి కారణంగా టైమ్ కి భోజనం చేయకపోవడం, శరీరానికి కావల్సినంతా ఆహారం తీసుకోకపోవడం వంటివి చేస్తూ ఉంటారు చాలమంది. దాంతో జీర్ణ వ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుంది. అజీర్తి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి ఉదర సంబంధిత సమస్యలకు యోగాలో ‘ మయురాసనం ‘ వల్ల చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ మయురాసనం వేయడం వల్ల ఉదర కండరాలకు శక్తి లభించి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మోచేతులు, కాళ్ళు, వెన్నెముక, కీళ్ల భాగాలను బలపరుస్తుంది. తద్వారా కీళ్ల నొప్పులు దూరం అవుతాయి. ఈ ఆసనం మగవారికి లైంగిక సామర్థ్యాన్ని పొంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఇక ఆడవారిలో ఋతు సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. మధుమేహం, పైల్స్ ఉన్నవారు ఈ మయురాసనం వేస్తే వాటి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం ద్వారా కడుపు భాగంలోని ప్రేగులు, ప్లీహం, కాలేయం వంటి వాటితో పాటు మూత్రపిండాలకు కూడా శక్తి లభిస్తుంది. ఇక ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతో పాటు మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో కూడా మయురాసనం ఎంతగానో తోడ్పడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు.

మయురాసనం వేయు విధానం

ముందుగా నేలపై లేదా యోగా షీట్ పై మోకాళ్ళను ఆనించి కూర్చోవాలి. ఆ తరువాత రెండు చేతులను ఫోటోలో చూపిన విధంగా చేతి వ్రేళ్లను కాళ్ళ దిశలో ఉండేటట్లుగా మరియు పరస్పరం కలిసి ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆ తరువాత రెండు మోచేతులను మడిచి పొట్ట భాగానికి అటువాపు మరియు ఇటువైపు ఆనించి శరీర భారం అంతా చేతుల సహాయంతో ఉదరంపై ఉంచుతూ వెనక్కి చాపిన కాళ్ళను మెల్లగా నేలపైనుంచి పైకి లేపాలి. ఈ సమయంలో శరీర భారమంతా చేతులపై మరియు కడుపుపై పడుతుంది. ఆ తరువాత తలభాగాన్ని కాస్త కిందకు వంచి శరీరమంతా నెలకు సమాంతరంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక శ్వాస క్రియను నెమ్మదిగా జరిగిస్తూ వీలైనంత సేపు ఈ ఆసనంలో ఉండి ఆ తరువాత సాధారణ స్థితికి రావాలి.

గమనిక

ఏదైనా ఉదర శస్త్ర చికిత్స జరిగిన వాళ్ళు ఈ ఆసనం వేయకూడదు. అలాగే అధిక రక్తపోటు మరియు మణికట్టు, లేదా మోచేతి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేయడం మంచిది కాదు. మహిళలు బహిష్టు సమయంలోనూ గర్భవతిగా ఉన్న సమయాల్లోనూ ఈ ఆసనాన్ని ఎట్టి పరిస్థితితో వేయరాదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -