జీడిమెట్ల ప్లాంట్‌ను సందర్శించిన మేయర్ విజయలక్ష్మీ..

92
- Advertisement -

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల లోని సి & డి వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును స్టాండింగ్ కమిటీతో కలిసి పరిశీలించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె..ఇప్పటివరకు ఈ ప్లాంటు ద్వారా 8 లక్షల టన్నుల డెబ్రెస్ ను తీసుకువచ్చామన్నారు.

అందులో రెండు లక్షల టన్నుల డెబ్రెస్ ను ప్రాసెస్సింగ్ చేసాం అని తెలిపిన మేయర్…నగరానికి దక్షణ, ఉత్తర ప్రాంతాల్లో మరో రెండు ప్లాంటు లను ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు. ఇప్పటికే జీడిమెట్ల ఫతుల్లాగూడ ప్లాంటు ల ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని 15 సర్కిళ్ల నుంచి డెబ్రెస్ సేకరిస్తున్నాం అన్నారు.త్వరలో మిగతా సర్కిళ్ల నుంచి సేకరిస్తాం అన్నారు.

ఇక అంతకముందు బంజారాహిల్స్ మేయర్ క్యాంప్ కార్యాలయంలో వాటర్ board 20000 లీటర్ లు ఊచిత నీటి పథకాన్ని వినియోగించుకోవాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు. అందరూ ఆధార్ కార్డ్ అనుసంధాన ప్రక్రియ ను డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని సూచించారు.

- Advertisement -