అది అవాస్తవం..నిరూపిస్తే చెవి కోసుకుంటా:మేయర్

26
vijayalaxmi

కార్పొరేటర్లందరికీ తాను అందుబాటులో ఉంటున్నానని తెలిపారు మేయర్ గద్వాల విజయలక్ష్మీ. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మీ…మేయర్‌ ఛాంబర్‌ను బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని ప్రస్తావించగా కార్పొరేటర్లకు అందుబాటులో ఉండడం లేదన్న ప్రచారంలో నిజం లేదన్నారు.

బీజేపీ కార్పొరేటర్లను తాను కలవడం లేదన్నది అవాస్తవమని, అది నిరూపిస్తే చెవి కోసుకుంటా అని స్పష్టం చేశారు. అందుకే జోన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని….. అధికారులు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి వారి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని అన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్తున్నానని చెప్పారు.