దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం “మాయామాల్”. హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 14న విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు చిత్రాన్ని ఒకవారం పోస్ట్ పోన్ చేసి జులై 21న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ ఎంటర్ టైనర్ ను కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన హరికృష్ణ మాట్లాడుతూ.. “జులై 14న మా “మాయా మాల్”ను విడుదల చేసేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆ రోజున ఎక్కువ సినిమాలు విడుదలవుతుండడం.. అదేరోజు విడుదల చేస్తే సినిమా ఎక్కువమంది జనాలకి చేరువయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మా డిస్ట్రిబ్యూటర్లు సూచించడంతో.. జులై 21కి విడుదలను వాయిదా వేయడం జరిగింది. అనుకున్నదానికంటే సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాలో విలన్ ఎవరనేది ఆసక్తికరమైన అంశం” అన్నారు.
షకలక శంకర్, తాగుబోతు రమేష్, సోనియా, పృథ్వీరాజ్, నాగినీడు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: సతీష్ శెట్టి, యాక్షన్: విజయ్, కళ: రమణ వంక, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, సంగీతం: సాయికార్తీక్, నిర్మాతలు: కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: గోవింద్ లాలం!