HappyBirthday:వైవీఎస్ చౌదరి

30
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలీలో ముద్ర వేసిన దర్శకుడు నిర్మాత వైవీఎస్ చౌదరి. బొమ్మరిల్లు నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు నిర్మించారు. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు. టాలీవుడ్ దర్శకేంద్రుడి దగ్గర శిష్యరికమే కాకుండా పుట్టినరోజును కూడా పంచుకున్నారు.

ఈయన సినిమాల్లో సంగీతం రొమాంటిక్ కథాంశం ద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించారు. యువసామ్రాట్ అక్కినేని నాగర్జునతో శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి అని సినిమా తీసి ఇండస్ట్రీలో బిగ్ హిట్‌ను అందుకున్నారు. అలాగే మొదటి సినిమాకు అవకాశం ఇచ్చిన నాగర్జునతోనే రెండో సినిమా తీశారు. సీతారామరాజుతో హరికృష్ణ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

Also Read: డింపుల్ హాయతి కేసులో అసలు నిజాలు

టాలీవుడ్ సూపర్ స్టార్‌ నటులతో అనేక హిట్‌ సినిమాలు అందించారు. వారిలో మహేశ్‌బాబు, హరికృష్ణ, మంచు విష్ణు, సాయిధరమ్ తేజ్, బాలకృష్ణ, రామ్ ఉన్నారు. నందమూరి హరికృష్ణతో లహరి లహరి లహరి సినిమా సీతయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లు అందుకున్నారు. అంతేకాదు రామ్‌తో దేవదాస్, సాయిధరమ్‌ తేజ్‌తో రేయ్, విష్ణుతో సలీమ్, బాలకృష్ణతో ఒక్కమగాడు, మహేశ్‌బాబుతో యువరాజు లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించారు.

Also Read: ఎఫైర్ల పై కీర్తి సురేష్‌ తొలి రియాక్షన్

- Advertisement -