మే23:ప్రపంచ తాబేళ్ల దినోత్సవం

45
- Advertisement -

ఈ ప్రపంచంలో భూమ్మీద నీటిలో జీవించే జంతువుల్లో తాబేలు ఒకటి. ఇవి వివిధ వాతావరణంలో జీవించి ఉంటాయి. నేడు మే23న ప్రపంచ తాబేళ్ల దినోత్సవం. సుసాన్ టెల్లెమ్, మార్షల్ థాంప్సన్ కలిసి 2000వ సంవత్సరంలో ప్రపంచ తాబేలకు ఒక రోజు ఉండాలని కృషి చేశారు. అయితే దీనికి మద్దతుగా అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి తాబేల పరిరక్షణ కోసం నిధుల సేకరణ లాంటి ఈవెంట్లను నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల తాబేలను సంరక్షించడానికి కృషి చేస్తున్నారు. తాజాగా 23వ ఎడిషన్‌ను జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ తాబేలు దినోత్సవంను ఐ లవ్ తాబేళ్లు అనే థీమ్‌తో రన్‌ అవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా తాబేళ్ల ఆవాసాలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ జాతులను మరియు వాటి భవిష్యత్తును సంరక్షించవలసిన కీలకమైన అవసరాన్ని తెలియజేసేలా ఏర్పాటు చేశారు. భారతదేశంలో వివిధ రకాల తాబేళ్లు జీవిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఒడిశాలోని గహీర్‌ మాతా బీచ్‌లో ప్రతి సంవత్సరం ఆలీవ్‌ రిడ్లే తాబేళ్లు వచ్చి సేద తీరుతాయి. అంతేకాదు వాటి పునరుత్పత్తిని పెంపోందించుకొని స్వంత స్థలాలకు వెళ్లుతాయి.

Also Read: WhatsApp:చాట్ లాక్

- Advertisement -