మ్యాక్స్‌వెల్.. ఊచకోత

46
- Advertisement -

టీమిండియాతో జరిగిన మూడో టీ20లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 223 పరుగుల లక్ష్యాన్ని 2 నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ ఊచకోతతో భారత బౌలర్లు బెంబేలెత్తిపోయారు. మ్యాక్స్‌వెల్‌ 48 బంతుల్లో 8 సిక్స్‌లు, 8 ఫోర్లతో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా ట్రావిస్‌ హెడ్‌ (35), కెప్టెన్‌ వేడ్‌ (28 నాటౌట్‌ రాణించారు. గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్‌కు తన విధ్వంసక ఇన్నింగ్స్‌తో గెలుపు బాట పట్టించాడు మ్యాక్స్‌వెల్‌.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 222 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదిరే సెంచరీతో రాణించాడు. 57 బంతుల్లో 7 సిక్స్‌లు, 13 ఫోర్లతో 123నాటౌట్‌ నిలవగా సూర్యకుమార్‌యాదవ్‌(39), తిలక్‌వర్మ(31 నాటౌట్‌) రాణించారు. మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Also Read:BJP:కమలం పార్టీ రంగు బయటపడిందా?

- Advertisement -