యుఎస్‌లో ‘మత్తు వదలారా 2’ అదిరె రెస్పాన్స్

7
- Advertisement -

బ్లాక్ బస్టర్ మత్తు వదలరాకు సీక్వెల్ గా ‘మత్తువదలారా2’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్ లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహించగా ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘మత్తు వదలారా2’ లో హీరోయిన్ ఫారియా అబ్దుల్లా నిధి పాత్రలో కనిపించగా ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోగా తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో కూడా మత్తును వదలరా 2 అదరగొడుతుంది.ఫస్ట్ వీకెండ్ కే హాఫ్ మిలియన్ మార్క్ ని చేరుకున్న ఈ చిత్రం ఇప్పుడు 7 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తోంది.

- Advertisement -