Chandrababu:టీడీపీ మాస్టర్ ప్లాన్..?

53
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత పార్టీ అస్తవ్యస్తంగా మారింది. ముందుండి నడిపించే నాయకడే జైల్లో ఉండడంతో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థంకాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీని ముందుండి నడిపే బాద్యతను బాలకృష్ణ మరియు నారా లోకేశ్ భుజాన వేసుకున్నారు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ టైమ్ లో చంద్రబాబు జైల్లో ఉండడం పార్టీకి తీవ్రంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అందుకే వీలైనంత త్వరగా బాబును బయటకు తీసుకు రావాలని టీడీపీ శ్రేణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. .

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే నానాదాన్ని జాతీయ స్థాయిలో వినిపించి వైసీపీ అరాచక పాలనను నేషనల్ మీడియాలో హైలెట్ చేయాలని టీడీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారట. అందులో భాగంగానే త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ ను ప్రస్తావించాలని భావిస్తున్నారట. ఇటీవల టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. పార్లమెంట్ లో చంద్రబాబు అరెస్ట్ ను ప్రస్తావిస్తే.. అందరి దృష్టి పడుతుందని అప్పుడు చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్రం చొరవ తీసుకునేలా విన్నవించుకోవచ్చనే ప్లాన్ లో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే పార్లమెంట్ లో చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావనపై కేంద్రం స్పందిస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ విషయంలో బిజెపి ఇప్పటి వరకు ఆచితూచి స్పందిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించిన తమకు సంబంధం లేదు అన్నట్లుగానే కేంద్ర పెద్దలు వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు అరెస్ట్ పై కేంద్ర పెద్దలు ఘాటుగా స్పందిస్తే ఆయనను బయటకు తీసుకోచ్చేందుకు కేంద్ర సహకారం కొరవచ్చని టీడీపీ శ్రేణులు వ్యూహరచన చేశారు. మరి టీడీపీ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Also Read:అతిథి..ఎంటర్‌టైన్ పక్కా

- Advertisement -