19 ఎకరాల్లో ఫార్మాసిటీ…:కేటీఆర్

244
Master plan for Pharma City says KTR
- Advertisement -

రాష్ట్రంలో అన్నివైపులా ఐటీని విస్తరించాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు మంత్రి కేటీఆర్. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…రాష్ట్రంలో 19వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటుచేయబోతున్నామని తెలిపారు.

టీఎస్‌ఐపాస్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని మంత్రి తెలిపారు. 15 ఐటీ పార్కులు,ఎస్‌ఈజెడ్‌లు ఉన్నాయన్న కేటీఆర్ రహేజా మైండ్ స్పేస్‌లో 1.10 లక్షల మందికి ఐటీ ద్వారా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.

దేశంలో అతిపెద్ద జౌళిపార్కును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఏర్పాటు చేశామన్నారు. అలాగే వివిధ పారిశ్రామిక పార్కులు రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. డ్రైపోర్టు ఏర్పాటుపై దుబాయ్ పోర్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. డ్రైపోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాలన్నారు. చందన్‌వెల్లిలో టెక్స్‌టైల్స్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టేందుకు ముందుకు వచ్చారని స్పష్టం చేశారు. జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ ఏర్పాటుకు 190 ఎకరాలు కేటాయించామన్నారు.

- Advertisement -