Ravi Teja:మాస్ జాతర..రిలీజ్ డేట్

9
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.

ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఆగస్ట్ 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ ఈ చిత్రం విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:రేప్ కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్యలు

- Advertisement -